ప్రకాశం జిల్లా మార్కాపురంలో లాక్డౌన్ కొనసాగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు బయటకు రావడం లేదు. మార్కాపురం డివిజన్ కేంద్రం కావడంతో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు బోసిపోయాయి. నిత్యావసరాలైన మెడికల్ షాపులు, కూరగాయల మార్కెట్, పాల దుకాణాలు, వైద్యశాలలు, పెట్రోల్ బ్యాంకులు మాత్రమే తెరిచి ఉంచారు. మార్కాపురం ఆర్టీసీ డిపో పరిధిలోని 82 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అయిదు బస్సులను సిద్ధంగా ఉంచినట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు.
మార్కాపురంలో కొనసాగుతున్న లాక్డౌన్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో లాక్డౌన్ నిబంధన కొనసాగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారులపై స్వల్ప సంఖ్యలో ప్రజలతో మాత్రమే దర్శనమిస్తున్నారు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు దుకాణాల ముందు బారులు తీరారు.
మార్కాపురంలో కొనసాగుతోన్న లాక్డౌన్