ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింగరాయకొండలో విగ్రహాల ధ్వంసం కేసు: పాత్రికేయులకు బెయిల్

సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంలో సిమెంట్ విగ్రహాల ధ్వంసం కేసులో అరెస్టైన పాత్రికేయులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

The court granted bail to the journalists
పాత్రికేయులకు బెయిల్

By

Published : Jan 12, 2021, 9:26 AM IST

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంలో సిమెంట్ విగ్రహాలు ధ్వంసం కేసులో అరెస్టైన పాత్రికేయులు... బెయిల్​పై విడుదలయ్యారు. ఈ నెల 5న వారు అరెస్ట్ కాగా.. జర్నలిస్ట్ సంఘాలు సహకారంతో కందుకూరు కోర్టులో పిటిషన్​ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం ఐదుగురు పాత్రికేయులకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్​పై విడుదలయిన పాత్రికేయులకు జర్నలిస్ట్ సంఘాలు స్వాగతం పలికాయి. సత్కారం చేసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఐ.వి.సుబ్బారావు, నాగేశ్వరరావు, బ్రహ్మం తదితర పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details