ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మూడో దశ ఎన్నికల నిర్వాహణ దగ్గర పడుతుండటంతో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భాస్కర్ ఎంపీడీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి విడత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామన్న ఆయన రెండో విడతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఇక మూడో విడత ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో సిబ్బంది కొరత లేకుండా సర్దుబాటు చేయటంతోపాటుగా.. కరోనా నియమ నిబంధనలను పాటిస్తూ.. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ కోరారు.
రెండో దశకు ఏర్పాట్లు పూర్తి.. వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
ఈనెల 17న మూడో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భాస్కర్ పరిశీలించారు. రెండో విడతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించేదుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ భాస్కర్