గత రెండు రోజలుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తిగలేరు కాలువకు జలకళ సంతరించుకుంది. ప్రకాశం జిల్లాలో ప్రధానమైన వెలుగొండ సాగునీటి ప్రాజెక్టులో భాగంగా తిగలేరు కాలువ ఉంది. యర్రగొండపాలెం మండలంలోని వీరాయపాలెం, కొలుకుల సమీపంలోని కాలువలో నీరు చేరింది. కాలువ నిర్మాణం పూర్తి కాకపోవటంతో వర్షం వచ్చినప్పుడల్లా కాలువ నిండు కుండల మారుతోంది. వాననీటితో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కురుస్తున్న వర్షాలు.. తిగలేరు కాలువకు జలకళ - prakasam
ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టులో భాగమైన తిగలేరు కాలువ జలకళ సంతరించుకుంది.

తిగలేరు కాలువ