TDP Varla on police in MLC case: తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పనితీరు చూస్తుంటే సిగ్గేస్తుందని, పోలీసులు ఇంతగా దిగజారిపోవాలా అనిపిస్తుందన్నారు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను కాపాడేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే.. ఆ కేసు విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హత్య చేయడంతో పాటు సాక్ష్యాన్ని తారుమారు చేయడం వంటి విషయాలను తేలిగ్గా తీసుకొని, పొరపాటున దెబ్బతగిలి మృతి చెందాడని పోలీసులు కట్టుకథలు అల్లడం చూస్తుంటే.. పోలీసు వ్యవస్థంటేనే సిగ్గేస్తుందని, ఒక ఎమ్మెల్సీని కాపాడటానికి పోలీసులు ఇంత దిగజారాలా అని వర్ల ప్రశ్నించారు.
'అనంత' కేసులో పోలీసుల తీరు సిగ్గుచేటు: వర్ల రామయ్య - TDP Varla on police in MLC case
TDP Varla on police in MLC case: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను కాపాడేందుకు అడుగడుగునా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ కేసులో వారి పనితీరు చూస్తుంటే సిగ్గేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్ల రామయ్య
రాష్ట్రప్రభుత్వం పనితీరు చూస్తుంటే తెల్లారి లేచే సరికి ఏ వార్త వినాల్సి వస్తుందో.. చూడాల్సి వస్తుందోనన్న భయం కలుగుతుందని తీవ్ర విమర్శలు చేశారు. నిత్యం హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడుకుతోందని వర్ల రామయ్య పేర్కొన్నారు.
ఇవీ చదవండి :