ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతిగీతతో మారిన నుదిటి రాత - ప్రకాశం జిల్లాలో చిత్రకారుడు

ఆయన ఉన్నత చదువులు చదవలేదు, అర్థికస్థోమత అంతంత మాత్రమే. అయినా అతని బలమైన సంకల్పం ఆయన్ను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అపురూప భావాలకు అద్దం పట్టే ఆ చిత్రాలు అతన్ని ఉన్నత చిత్రకారుడిగా నిలబెట్టాయి. ఆయనే ఆకివీడు గ్రామానికి చెందిన సూర శంకర్ రెడ్డి.

sura shankar reddy painting
చిత్రాలు వేస్తున్న శంకర్ రెడ్డి

By

Published : Mar 9, 2020, 11:29 PM IST

Updated : Mar 9, 2020, 11:46 PM IST

చిత్రాలు వేస్తున్న శంకర్ రెడ్డి

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన చిత్రకారుడు సూర శంకర్ రెడ్డి ఆర్థికస్థోమత లేక పదో తరగతిలోనే చదువు మానేసి తల్లిదండ్రులకు అండగా నిలిచాడు. అయితే చిత్రకారుడిగా రాణించాలని కోరిక మాత్రం ఆయన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తునే ఉండేది. స్నేహితులు చేయూతతో చిత్రలేఖనంలో ఉపాధ్యాయ కోర్సు పూర్తి చేశారు. 1990లో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా ఎంపిక అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో అతనికి ఉద్యోగం లభించలేదు. అయినా నిరాశ చెందకుండా వ్యవసాయం చేస్తూనే.. నూతన దేవాలయాల్లో రామాయణం, మహాభారతం, చిత్రాలను వేస్తూ మిగతా సమయాల్లో అందమైన చిత్రాలను గీస్తూ తనకంటూ గుర్తింపు పొందాడు. జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.

Last Updated : Mar 9, 2020, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details