ప్రకాశం జిల్లా ఒంగోలులో రాత్రి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సుడిగాలి పర్యటన చేశారు. అద్దంకి బస్టాండ్ మీదుగా కొప్పోలు మార్గంలో నిభందనలకు విరుద్ధంగా 10 గంటలకు తర్వాత కూడా మద్యం విక్రయిస్తున్న వైన్స్ దుకాణంపై దాడి చేశారు. ఎస్పీ రాకను గుర్తించిన మద్యం బాబులు పరుగులు పెట్టారు. సమయం ముగిసినా మద్యం దుకాణంలో మద్యం సేవించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తపట్నం బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ రైల్వే పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉండటం పట్ల రైల్వే పోలీసులతో అడిగి కారణాలు తెలుసుకున్నారు. చర్చి కూడలి , నెల్లూరు బస్టాండ్ మీదుగా పాత జడ్పీ కార్యాలయం వద్ద ఖాలీ ప్రదేశాలను పరీశీలించారు. నిత్యం ప్రత్యేకంగా పోలీసులు రాత్రి గస్తీ నిర్వహిస్తుంటారని వారి పని తీరు తెలుసుకునేందుకు పర్యటించినట్లు తెలిపారు. సమయం ముగిసిన తర్వాత కూడా మద్యం దుకాణాలు తెరిచి ఉంటున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
బుల్లెట్‌పై ఎస్పీ సుడిగాలి పర్యటన - addanki
ప్రకాశం జిల్లా ఒంగోలులో రాత్రి వేళ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సుడిగాలి పర్యటన చేశారు. ద్విచక్ర వాహనంపై బయలు దేరి పవర్ ఆఫీస్ సెంటర్ వద్ద ఓ బార్ అండ్ రెస్టారెంట్‌ని పరిశీలించారు.
ఒంగోలులో బుల్లెట్‌పై ఎస్పీ సుడిగాలి పర్యటన
ఇదీ చదవండీ:నెట్టింట విరాట్‌కు 'కోట్లాభిమానం'...!