ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన బంతుల వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటుంది. రంగుతోటకు చెందిన యువకులు పసుపు, ఎరుపు రంగులు కలిగిన 3500 స్మైలీ బంతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతీ ఏటా రంగుతోట యువకులు ఏదో ఒక విశేషమైన గణపతిని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఇలా బంతులతో దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో వినాయకుని ప్రతిమను రూపొందించారు. పూజలకు మాత్రం వేరే గణపతిని ప్రతిష్టించారు.
అందరినీ ఆకట్టుకుంటున్న..స్మైలీ బంతుల వినాయకుడు - ఒంగోలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో స్మైలీ బంతుల గణపతి అందరినీ ఆకట్టుకుంటోంది. రంగుతోటకు చెందిన యువకులు పసుపు, ఎరుపు రంగులు కలిగిన 3500 బంతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
అందరిని..అకట్టుకుంటున్న స్మైలీ బంతుల వినాయకుడు