ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆరు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన వారిలో ముగ్గురు నంద్యాలలో చికిత్స పొందుతుండగా.. మరో ముగ్గురు మార్కాపురంలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. మార్కాపురంలోనే ఆరు కేసులు నమోదయ్యాయని మార్కాపురం కొవిడ్ కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ రాంబాబు తెలిపారు.
మార్కాపురంలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఆరు కేసులు నమోదు! - markapuram latest news
రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్ విస్తరిస్తుంటే.. మరో వైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆరు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డట్లు వైద్యులు తెలిపారు.
మార్కాపురంలో బ్లాక్ ఫంగస్ కలకలం