ప్రకాశం జిల్లా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.
లాక్ డౌన్ తరువాత 82 రోజులకు హుండీ ఆదాయము రూ. 19 లక్షల 62,177 లు వచ్చింది. అమెరికన్ డాలర్లు 22 వచ్చాయి. పర్యవేక్షణ అధికారిగా అద్దంకి ఇన్ స్పెక్టర్ కె. రంగ లక్ష్మి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.