ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ వద్దకు ఎంపీపీ పంచాయితీ..సీల్డ్​ కవర్​లో ప్రకటిస్తామన్న సీఎం

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఎంపీపీ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రగడ మొదలైంది. ఎంపీపీల ఎంపిక పంచాయితీ సీఎం జగన్ వద్దకు చేరింది.

1
1

By

Published : Sep 21, 2021, 10:40 PM IST

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఎంపీపీ ఎంపిక పంచాయితీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరింది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఎంపీపీ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రగడ మొదలైంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు దర్శి నియోజకవర్గ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

ఎంపీపీని తమ వర్గానికి చెందిన వారినే నియమించాలని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మంత్రి బాలినేని ద్వారా సీఎంను ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కలిశారు. అయితే ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చి కలసి పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ముండ్లమూరు ఎంపీపీగా ఎవరిని నియమించాలో సీల్డ్ కవర్ ద్వారా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాలు ముఖ్యమంత్రి హామీతో వెనుదిరిగారు.

ఇదీ చదవండి:Pawan: 'ఎంపీపీ ఎన్నికలో మా వాళ్లకు అన్యాయం జరిగితే.. నేనే వస్తా'

ABOUT THE AUTHOR

...view details