ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పూలవారిపాలెం గ్రామదేవత వీర్లంకమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆలయ పూజారి శంకరరావు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో కొన్ని రోజుల్లో హుండీని తెరచి ఆదాయాన్ని లెక్కిదామనుకుంటున్న సమయంలో దొంగలు పడి, నగదు దొంగిలించారని పూజారి అన్నారు. దేవతల నగదుకే రక్షణ లేనప్పుడు, ఇక తమకెక్కడ రక్షణ ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
అమ్మవారి గుడిలో దొంగలు హల్చల్
ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఆ గుడి భక్తులతో రద్దీగా ఉంటుంది. సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చే గుడిపై దొంగల చూపుపడింది. అదునునచూసి హుండీని స్వాహాచేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది.
అమ్మవారినీ వదలలేదు దొంగలు