కరోనా వ్యాప్తి నివారణకు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 మండలాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని 19 మండలాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకే దుకాణాలు తెరుచుకుంటాయని కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. అత్యవసర సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతానికి పడకలు, ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. కొవిడ్ కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాలో 18 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ వివరించారు.
కరోనా కలవరం: 19 మండలాల్లో ఆంక్షలు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రకాశం జిల్లాలోని 19 మండలాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం మరో రెండు గంటలు మాత్రమే దుకాణాలను తెరుచుకోవడానికి అనుమతినిచ్చారు.
ప్రకాశం జిల్లాలో కరోనా నిబంధనలు