కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో బాలికలకు పౌష్టికాహారం, వ్యక్తిగత శుభ్రత, రక్తహీనత వంటి విషయాల్లో అవగాహన పై ప్రకాశం జిల్లా కలక్టర్ పోల భాస్కర్ ఒంగోలులో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బేస్తవారిపేట, హెచ్.ఎం.పాడు, కెకె మిల్లి కేజీబీవీల్లో ఈ ఏడాది ఒక్కొక్క విద్యార్థిని మాత్రమే అడ్మిషన్ పొందారని, అర్హులైన విద్యార్థులను ప్రభుత్వ నిబంధనల మేరకు అడ్మిషన్లు పొందే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలల్లో అధ్యాపకులు కొరత ఉందని , అందువల్ల గెస్ట్ లెక్చరర్లను నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ వెంకటేశ్వరరావు, డీఈవో సుబ్బారావులు పాల్గొన్నారు.
కేజీబీ పాఠశాలలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్ష - కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో
కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో వసతలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. అధ్యాపకులతో వివిధ అంశాలపై చర్చించారు.
కేజీబీ పాఠశాలలపై