కరోనా తొలిదశతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు ఎక్కువగా ఉందని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ ఏసయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించుకోలేనివారు.. తమకు సమాచారం ఇస్తే ఆ క్రతువు పూర్తిచేయిస్తామని చెప్పారు.
ఇందుకోసం చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారు 90004 99567, 95156 39900 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇస్తే.. మున్సిపల్ సిబ్బంది వచ్చి దహనసంస్కారాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు.