ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని గురకాయ పాలెలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన పాన్‌మసాలా గోదాముపై పోలీసులు దాడులు చేశారు. 30 గోతాలలో 150 చిన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకు విలువ సుమారు 16లక్షలు ఉంటుందని దర్శి డీఎస్పీ ప్రకాష్‌రావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పాన్ మసాలా పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాష్‌రావు ప్రజలను హెచ్చరించారు.
అద్దంకిలో పాన్ మసాలా గోదాంపై పోలీసులు దాడి - అద్దంకి
ప్రకాశం జిల్లా అద్దంకి లో నిల్వఉంచిన పాన్ మసాలా గోదాముపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు16లక్షలు సరకును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
అద్దంకిలో పాన్ గోదాముపై పోలీసులు దాడి