ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఎదుట ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి నుంచి కలక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని కోరారు. ఫీఎఫ్ను తమ ఖాతాల్లోనే జమ చేయాలని, వేధింపులు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
వేతనాలివ్వాలని... పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ.. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఒంగోలులోని రిమ్స్ ఎదుట ధర్నా నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికులు