ఒంగోలు రిమ్స్ సిబ్బంది ఆస్పత్రిలోని ఏసీలను తమ ఇళ్లకు తరలించుకున్నారు. ఇంటి దొంగలపనే కావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రిమ్స్ ఆస్పత్రిలో 20 ఏసీలు ఎత్తుకెళ్లిన ఇంటిదొంగలు
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో దొంగలు పడ్డారు. అయితే.. వాళ్లు బయటివాళ్లు ఎవరో కాదు. సాక్ష్యాత్తూ ఆస్పత్రి సిబ్బందే. వాళ్లు ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 20 ఏసీలను ఎత్తుకెళ్లారు.
ongole-rims-hospital
రిమ్స్‌లో వైద్య పరికరాల నిర్వహణ సంస్థ సక్రమంగా పని చేయడం లేదని, ఇలాంటివి నిలిపివేసి, కొత్తగా వేరేవారిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ అన్నారు. ఆసుపత్రిలో ఆర్థిక ఇబ్బందులకై దాతల సహకారం తీసుకోవాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటి సమావేశంలో కలెక్టర్ సూచించారు.