ఒంగోలు కర్నూలు రహదారి లైటింగ్ సమస్య ఒంగోలు నుంచి కర్నూలు వైపు వెళ్లే రహదారి... నగరానికి వచ్చే ప్రయాణికులు, సరకు రవాణా వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఏడాది క్రితం విస్తరణ పనులు చేసి.. నాలుగు వరుసల రహదారిగా మార్చారు. ఒంగోలు కేంద్రం నుంచి పేర్నమిట్ట... మీదుగా కర్నూలుకు వెళ్లే ఈ మార్గంలో.. రాత్రివేళ చిమకుర్తి నుంచి గ్రానైట్ రాళ్లు తరలించే లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు ఈ దారితో అనుసంధానమై ఉన్నాయి.
ఇబ్బందులు తప్పట్లేదు..!
రహదారి విస్తరణ చేసిన అధికారులు.. లైటింగ్ వ్యవస్థను పునరుద్ధరించలేదు. ఈ కారణంగా రాత్రి పూట రహదారి మార్గం కనిపించక వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుసంధాన రోడ్లపై నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చేవారు చీకటి కారణంగా కనిపించడంలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పనులు ముందుకు సాగువు..?
ఈ రహదారిపై సాయంత్రం నుంచి గ్రానైట్ వాహనాలు తిరుగుతుంటాయి. భారీ వాహనాల రాకపోకలతో సాయంత్రం అయ్యేసరికి ట్రాఫిక్ రద్దీ అధికం అవుతుంది. రహదారి విస్తరించినా వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చీకట్లో వాహనం రాకను గమనించలేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇంతవరకూ ఆ పనులు ముందుకు సాగలేదు. రహదారి విస్తరణ పనుల్లోనే సెంటర్ లైటింగ్ కోసం ప్రణాళికలు రూపొందించినా, ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రతిపాదన మరుగునపడింది.
అంధకారంగా ఉన్న రోడ్డుపై లైట్లు అమర్చితే ప్రమాదాలను అరికట్టవచ్చని... అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి :
నకిలీ ఈ-వే బిల్లులతో కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు..!