800 కోట్లకు పైగా వ్యాపారం..!
నిందితులు లేని అడ్రసులతో 278 నకిలీ కంపెనీలు సృష్టించి... వాటి ద్వారా 18 వేల ఈ - వే బిల్లులను తయారుచేసి, రూ.300 కోట్ల వ్యాపార లావాదేవీలు చేశారని ఎస్పీ వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లోని కొనుగోలుదారులతో రూ.800 కోట్లకు పైగా మార్కెట్ చేస్తున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా.. ప్రభుత్వానికి రూ.52 కోట్ల 20 లక్షలు పైగా పన్నులు ఎగ్గొట్టారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 123 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. వీరిలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది నెలలుగా.. ఈ కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా నిందితులను అదుపులోకి తీసుకుంటామని ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు.
ఇదీ చదవండి: