రాష్ట్రంలో కరోనా కేసులు తొలి దశలోనే బయటపడిన జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. లండన్ నుంచి వచ్చిన యువకుడే తొలి బాధితుడు. అతణ్ని వెంటనే రిమ్స్‌లో ఐసోలేట్ చేయడం, నివాస ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ చేయడం, కాంటాక్టులను గుర్తించడంలో యంత్రాంగం వేగంగా స్పందించింది. పరిస్థితి అదుపులోనే ఉందనుకున్న సమయంలో దిల్లీ మర్కజ్ కేసులు సవాల్ విసిరాయి. వందల మందిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేశారు. జిల్లాలో 61 కరోనా కేసులు జిల్లాలో నమోదవగా వీరిలో 60 మందిని నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఒకరికి మాత్రమే చికిత్స జరుగుతోంది. జిల్లా కొవిడ్ నోడల్ అధికారి జాన్ రిచెట్స్, రిమ్స్ సూపరింటెండెంట్ సమన్వయంతో కరోనా కట్టడి చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా ఇండియన్ మెడికల్ ఆసోషియేషన్ సిబ్బంది సైతం సాధారణ వైద్య సేవలు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా పరీక్షల నమునాల సేకరణ వంటి కార్యక్రమాల‌్లో తోడ్పాటు అందించడం వైద్యులపై పనిభారాన్ని తగ్గించింది.