ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉంది: మంత్రి ఆళ్ల నాని

కరోనాపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. అందరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. మరోసారి బాధితుని రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్లు మంత్రి వివరించారు. జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

alla nani
alla nani

By

Published : Mar 21, 2020, 4:45 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా అంశంపై ఒంగోలు కలెక్టరేట్‌లో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేశ్‌, జిలా కలెక్టర్‌, ఎస్పీ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి అన్నారు. ఒంగోలులో ఒక కేసు నమోదైన తర్వాత అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. మరోసారి బాధితుని రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్లు మంత్రి వివరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. జనతా కర్ఫ్యూలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించినట్లు మంత్రి నాని పేర్కొన్నారు. అందరినీ అసోలేషన్‌ వార్డుల్లో, హౌస్‌ క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆళ్ల నాని తెలిపారు.

ఇదీ చదవండి:రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details