ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''నిందితుల తరుపున మాట్లాడితే జైలుకు పంపుతాం''

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్​కు రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి విచ్చేశారు. అత్యాచారeనికి గురై చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు.

నన్నపనేని రాజకుమారి

By

Published : Aug 1, 2019, 11:58 PM IST

నిందితుల తరుపున మాట్లాడిన వారిని జైలుకుపంపుతాం

అత్యాచార ఘటనల్లో నిందితులకు అనుకూలంగా గ్రామపెద్దలు రాజీయత్నాలు చేస్తే వారిని కూడా జైలుకి పంపుతామని రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. అత్యాచారానికి గురై చికిత్స పొందుతున్న బాలికను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలికను అపహరించి దాడిచేసి, అత్యాచారం చేయడమే కాక ఆ దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించి ఘోర నేరాలకు పాల్పడిన ముగ్గురు యువకులను క్షమించొద్దని.... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో అత్యాచారలపై మాట్లాడాల్సిన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నన్నపనేని ఆరోపించారు. బాధిత బాలికకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details