ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 అని రాస్తే మాత్రం కొంప కొల్లేరే... బీ అలర్ట్..!

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్​ను ఎంజాయ్ చేయాడానికి అందరూ సిద్ధమవుతున్నారు. డిసెంబరు 31న గ్రాండ్​గా పార్టీ చేసుకోబోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ 2020 మనందరికీ ఓ కొత్త సమస్యను తీసుకురానుంది. అదేంటి కొత్త సంవత్సరంతో సమస్యా...? అని ఆశ్చర్యపోకండి. కాస్త జాగ్రత్త వహిస్తే సింపుల్​గా బయటపడవచ్చు. అదేంటో తెలుసుకుందామా..!

must write 2020 on checks in this  year
must write 2020 on checks in this year

By

Published : Dec 30, 2019, 1:04 PM IST

Updated : Dec 30, 2019, 1:49 PM IST

నూతన సంవత్సరం రాబోతుంది. 2020లోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆ క్షణాల కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచాలని కోరుకోని వారంటూ ఉండరు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే సంవత్సరం మన జీవితాలను తలకిందులు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అదేంటంటే... చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై తేదీ రాసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొంప మునిగే ప్రమాదం ఉంది.

ఇది పాటించకపోతే కొంప కొల్లేరే..!
ఉదాహరణకు మనం 2020 ఫిబ్రవరి 15వ తేదీ పేరుతో చెక్ ఇవ్వాలనుకుంటే... 15-02-20 అని రాసి ఇస్తాం. సరిగ్గా ఇక్కడే మనకు ఓ చిక్కు వచ్చి పడనుంది. మీరు సంవత్సరం దగ్గ కేవలం 20 అని రాసి వదిలేస్తే 20 సంఖ్య తరువాత ఏ నంబరైనా రాసే అవకాశం ఉంటుంది. అదే 20 తర్వాత 19 అని రాస్తే 2019 అవుతుంది. 17 అని రాస్తే 2017 అవతుంది. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని టోకరా పెట్టే గ్రూపులెన్నో ఇప్పటికే కాచుకోని ఉంటాయి. ఇలా డాక్యుమెంట్లు, చెక్కులపైన సులభంగా తేదీలు మార్చిపడేస్తారు. అందుకే ముఖ్యమైన వాటిపై తేదీలు రాసే విషయంలో అలర్ట్​గా ఉండాల్సిందే.

సమస్యకు పరిష్కారం ఎలా..?
మరి ఈ సమస్య నుంచి ఎలా బయపడాలని అనుకుంటున్నారా..? చాలా సింపుల్. సంవత్సరాన్ని పూర్తిగా రాస్తే సరిపొతుంది. అంటే మీరు 2020 ఫిబ్రవరి 15 అని చెక్​ పై రాయాలనుకుంటే... 15-02-2020 అని పూర్తిగా రాయాలి. అప్పుడు తేదీని మార్చే ఛాన్స్ ఏ మాత్రం ఉండదు. ఈ చిన్న లాజిక్ కాస్త మర్చిపోతే మాత్రం అంతే సంగతులు... బీ కేర్​ పుల్.

ఇదీ చదవండి : కాసేపట్లో 'మహా' మంత్రివర్గ విస్తరణ- అజిత్, ఆదిత్యకు చోటు

Last Updated : Dec 30, 2019, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details