హెల్మెట్ వాడకంపై పోలీసుల అవగాహన ర్యాలీ
ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని ముండ్లమూరు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.
శిరస్త్రాణం-శిరోధార్యం
ద్విచక్రవాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలోని ముండ్లమూరు పోలీసులు ప్రజలకు వివరించారు. ఠాణా పరిధిలోని కొన్ని గ్రామాల్లో హెల్మెట్ ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు.. పోలీసులంతా హెల్మెట్లు ధరించి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరించారు.