ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలులో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం - పురపాలక ఎన్నికలు తాజా వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో పురపాలక ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్ల కరుణ కోసం అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వినూత్న పద్ధతిలో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ongole municipal elections
ఒంగోలులో పురపాలక ఎన్నికల ప్రచారం

By

Published : Feb 28, 2021, 12:26 PM IST

పురపాలికల్లో ఎన్నికల వేడి పుంజుకుంటోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఒంగోలు నగరపాలక సంస్థలో పోటీలో ఉన్న కార్పొరేట్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మేయర్‌ అభ్యర్థి డా.అల్లాడి సరోజినీ దేవి 36వ డివిజన్‌లో ప్రచారంలో నిర్వహించారు. తాను గెలిస్తే పట్టణాభివృద్ధికి కృషిచేస్తానంటూ సరోజినిదేవి హామీ ఇచ్చారు.

కొండమెట్ట ప్రాంతంలో జనసేన అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఓటర్లుకు చూపిస్తూ ఆకట్టుకున్నారు. వైకాపా అభ్యర్థులు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో రాష్ట్రం ఎంతో అభివృధ్ధి చెందుతుందని.. నగర అభివృద్ధికి వైకాపాతో మాత్రమే సాధ్యమని ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details