ప్రకాశం జిల్లా మార్టూరు మండలం తాటివారిపాలెంలో ఉండే శోభన్ , మాధవి దంపతులకు జన్మించిన రెండో సంతానం అమూల్య పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. ఇది ఆ భార్యాభర్తలను తీవ్రంగా కుంగదీసింది. దీన్ని తట్టుకోలేకే భర్త తాగుడికి బానిసై భార్యాబిడ్డలను నిర్లమక్ష్యం చేశారు. భర్త ప్రవర్తన, కుమార్తె దుస్థితి చూసి మనస్థాపానికై గురైన మాధవి తీవ్ర ఒత్తిడికి లోనై.. కుమార్తెతో కలిసి ఇంటికి సమీపంవలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బావిలో దూకి తల్లీకుమార్తె ఆత్మహత్య - suside
కుమార్తె మానసిక వైకల్యం, తాగుడుకు బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేని ఓ ఇల్లాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బిడ్డతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది.
బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య