ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడాదిలోనే హామీలన్నీ నెరవేర్చాం: మంత్రి బాలినేని - మంత్రి బాలినేని శ్రీనివాసరావు

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని.. మంత్రి బాలినేని శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపామని చెప్పారు.

minister balineni srinivasarao press meet in prakasam district
మంత్రి బాలినేని శ్రీనివాసరావు

By

Published : Jun 8, 2020, 2:40 PM IST

ఏడాది పాలనలో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించామని... విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులో మాట్లాడుతూ.. విద్యుత్ రంగం కోసం రూ. 1500 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యామని చెప్పారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

వ్యవసాయ రంగ రాయితీలకు సంబంధించి గత ప్రభుత్వం బకాయిలు పెడితే.. వాటిని తాము తీర్చుకుంటూ వస్తున్నామన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. 86 పరిశ్రమలను గుర్తించి వాటిలో తనిఖీలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలు దాదాపుగా అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని మంత్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details