పేదవర్గాల గుండెల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన వివిధ నామినేటెడ్ పదవులను పరిశీలిస్తే మరోమారు ఈ విషయం రుజువయిందన్నారు. రాష్ట్రంలో శనివారం ప్రకటించిన రాష్ట్ర, జిల్లా స్థాయి ఛైర్మన్లను చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై అయనకున్న ప్రేమ స్పష్టమైందన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, డా.బిఆర్.అంబేద్కర్ లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
'పేదల గుండెల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు' - Minister Adimulapu Suresh updates
దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు. రాష్ట్రంలోని 137 రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కార్పొరేషన్లలో 60 శాతం వరకు పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, డా.బిఆర్.అంబేద్కర్ లాంటి మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
రాష్ట్రంలోని 137 రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కార్పొరేషన్లలో 60 శాతం వరకు పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని మంత్రి సురేష్ అన్నారు. అందులో మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించటం గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఒక ఎస్సీ మహిళను హోంమంత్రిని చేయడం జరిగిందని, ఎస్సీల్లో నుంచి తనకు ప్రాధాన్యత ఇచ్చి విద్యాశాఖను ఇచ్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వెనకబడిన వర్గాల కోసం రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి