రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడమే మూడు రాజధానుల ఉద్దేశమని.. విద్యా శాఖ మంత్రి అదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్ళు పూర్తైన సందర్భంగా.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వేడుకలు నిర్వహించారు. ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేపట్టారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'జగన్ చొరవతో 16 నెలల్లోనే 16 వైద్య కళాశాలలు' - యర్రగొండపాలెంలో ఘనంగా జగన్ పాదయాత్ర వేడుకలు
సీఎం జగన్ అధికారం చేపట్టిన 16 నెలల కాలంలోనే 16 వైద్య కళాశాలలు తీసుకొచ్చారని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మూడు రాజధానుల ఉద్దేశం.. అభివృద్ధి వికేంద్రీకరణేనని పేర్కొన్నారు. తమ అధినేత పాదయాత్రకు మూడేళ్లైన సందర్భంగా.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వేడుకలు నిర్వహించారు.
మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్
పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎంతో మేలు జరిగిందని మంత్రి తెలిపారు. మార్కాపురంలో వైద్య కళాశాల రావడమే అందుకు ఉదహరణన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి.. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు
ఇదీ చదవండి:చీరాలలో వైకాపా నేతల ర్యాలీ