ప్రకాశం జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన మెప్మాబజార్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ సమీపంలో ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటుచేశారు. పొదుపు మహిళలు తయారుచేసిన తినుబండారాలు, చేతితో నేసిన దుస్తులు, పచ్చళ్ళు, కారంపొడులు ఇలా.. అమ్మకాలు జరుపుతున్నారు. తామే స్వయంగా వీటిని తయారుచేశామని.. కల్తీ ఏమీ ఉండదని వ్యాపారులు భరోసా ఇస్తున్నారు. కొనుగోలుదారులూ పెద్దసంఖ్యలో వస్తున్నారు. ప్రతి నెల రెండో బుధవారం మెప్మాబజార్ ఏర్పాటు చేస్తున్నట్టు మేనేజన్ చైతన్య తెలిపారు.
వినియోగదారులను ఆకట్టుకుంటున్న మెప్మాబజార్ - ongole
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చీరాలలో ఏర్పాటు చేసిన మెప్మాబజార్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
మెప్మాబజార్