ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టి అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారులు - ri

ప్రకాశం జిల్లా జముకులదిన్నే చెరువులో అనుమతులులేకుండా మట్టిని తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.

మట్టితవ్వకాలు

By

Published : Jun 18, 2019, 2:20 PM IST

అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు

ప్రకాశంజిల్లా దర్శి మండలం జముకులదిన్నెలో చెరువులోని మట్టిని అనుమతులులేకుండా రైల్వేకాంట్రాక్టు పనులకు తరలించడాన్ని రెవెన్యూ సిబ్బంది నిలుపుదల చేశారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైను పనులకు చెరువు పూడిక మట్టిని వాడుతున్నారు. గ్రామస్థులకుగాని, గ్రామపంచాయతీ గాని సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టరు మట్టిని రెండు రోజులుగా తవ్వుతున్నాడు. ఎవరైనా అడిగితే కేంద్రప్రభుత్వ పనికి వాడుతున్నామని తెలిపాడు. స్థానికులు రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. రెవెన్యూ ఇన్​స్పెక్టర్ చెరువు వద్దకు వెళ్ళి అనుమతులు లేకుండా మట్టిని తవ్వకూడదనిని వాహనాలను నిలుపుదల చేశారు. గ్రామస్థుల్లో ఒక వర్గం వారుమాత్రం చెరువు బాగుపడుతుందని.. అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అధికారులు మాత్రం అనుమతులు తీసుకొని తవ్వుకోవలసిందిగా తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details