రామాయపట్నం పోర్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని... రామాయపట్నం పోర్టు సాధన సమితి కన్వీనర్ చుండూరు రంగారావు విమర్శించారు. మైనర్ పోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వల్లనే కేంద్రం తన నిర్ణయాన్ని విరమించుకొని.. నిర్మాణ బాధ్యతతో తమకు సంబంధం లేదని ప్రకటించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టు విషయంలో చేసిన ప్రకటన విస్మయానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
'రామాయపట్నం పోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి' - రామయపట్నం పోర్టుపై కేంద్ర ప్రభుత్వం కామెంట్స్
రామాయపట్నంను మేజర్ పోర్టుగా ప్రకటించి.. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలని పోర్టు సాధన సమితి, ప్రకాశం అభివృద్ధి వేదిక డిమాండ్ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో పోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్షం సమావేశం జరిగింది.
leaders on ramayapatnam port
ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న పోర్టు, నౌకా నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని తెదేపా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. కృష్ణపట్నం పోర్టుకు మేలు చేయడానికే రామాయపట్నాన్ని నీరుగారుస్తున్నారని వామపక్షాల ప్రతినిధులు వీరారెడ్డి పేర్కొన్నారు. మేజర్ పోర్టుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:తిరుమలలో మొరాయించిన సర్వర్... నిలిచిన తితిదే సేవలు