ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల మధ్య మద్యం దుకాణం వద్దని.. మహిళల ఆందోళన

జనావాసాల మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన

By

Published : Sep 28, 2019, 12:03 PM IST

మద్యం దుకాణం తొలగించాలని మహిళల ఆందోళన
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎస్టీ కాలనీలో ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయటంతో కోపోద్రిక్తులైన మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలంతా కలిసి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి... మద్యం దుకాణం తొలగించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం వినుకొండ-యర్రగొండపాలెం రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వలన ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. వెంటనే దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ ముక్కంటి సంఘటనాస్థలానికి చేరుకొని మహిళలతో చర్చించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details