ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో వైభవంగా కార్తిక దీపోత్సవం

కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తిక దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

By

Published : Nov 30, 2020, 12:07 PM IST

Updated : Nov 30, 2020, 1:56 PM IST

karthika-pournami-celebrations-at-prakasham-district
ప్రకాశం జిల్లాలో వైభవంగా కార్తిక దీపోత్సవం

ప్రకాశం జిల్లాలో...

జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రాధాన్యాన్ని వేద పండితులు వివరించారు. ఆలయ ప్రాకార మండపం మధ్యలో దీపాలంకరణ చేశారు. స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి... పూజాలు చేశారు. సహాయ కమిషనర్ ఎన్. శ్రీనివాసరెడ్డి, ఆర్చకులు ఎస్ఎస్ఆర్ ఆచార్యులు, కోట లక్ష్మీ నారాయణ తదితరులు శాస్త్రోక్తంగా దీపోత్సవం నిర్వహించారు.

చీరాల మండలం వాడరేవులో భక్తులు పుణ్యస్నానాలను అచరిస్తున్నారు. తీరంలో కార్తీకదీపాలను వెలిగించారు. చీరాల,వేటపాలెం, చినగంజాం, మార్టూరు ప్రాంతాల్లోని శైవక్షేత్రాలలో గరళకంఠుని దర్శనం కోసం బారులుదీరారు. ఈపూరుపాలెంలో ఉప్పుతో ఆరు ఆడుగుల శివలింగాన్ని భక్తులు తయారు చేశారు. ఈ శివలింగం ప్రత్యేక అకర్షణగా నిలిచింది. చీరాల డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటిస్తూ...పూజలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

మన చెరువులకు అంతర్జాతీయ గౌరవం

Last Updated : Nov 30, 2020, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details