జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ వైద్యులు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. ప్రజా వైద్య వ్యతిరేక బిల్లును తీసురావటం అన్యాయమని వెంటనే బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెక్ట్స్ పరీక్ష పేరుతో వైద్య విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని వాపోయారు. సరైన సదుపాయాలు కల్పించి శాశ్వత పద్ధతిలో వైద్యులుగా తీసుకుంటే.. గ్రామాల్లో వైద్యం అందించేందుకు తాము సిద్ధమని తెలిపారు. మధ్యవర్తుల ద్వారా వైద్యం అందించి వైద్య ప్రమాణాలు దిగజారేలా చూడవద్దని కోరారు. జూనియర్ వైద్యుల నిరాహార దీక్షలకు ఐఎమ్ఏ వైద్యులు మద్దతు తెలిపారు.
ఎన్ఎమ్సి బిల్లును నిరసిస్తూ జూడాల నిరాహార దీక్ష
ఎన్.ఎమ్.సి బిల్లును నిరసిస్తూ ఒంగోలులో జూనియర్ వైద్యులు రిమ్స్ అసుపత్రి వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య ప్రమాణాలు దిగజారేలా బిల్లు ఉందని అన్నారు.
ఎన్.ఎమ్.సి బిల్లును నిరసిస్తూ ఒంగోలులో జూడాల నిరాహార దీక్ష