కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకూ బీమా సౌకర్యం కల్పించాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో పాత్రికేయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
'పాత్రికేయులకూ బీమా సౌకర్యం కల్పించాలి'
కరోనా విజృంభిస్తున్నా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమకు బీమా సౌకర్యం కల్పించాలంటూ పాత్రికేయులు ఒంగోలులో నిరసన వ్యక్తం చేశారు. వైరస్ సోకి మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
Journalists protest at Collectorate in ongole
వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మాదిరి పాత్రికేయులు కూడా రాత్రి, పగలు కష్టపడుతున్నారని అన్నారు. అందువల్ల తమకు కూడా బీమా ప్రయోజనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనాతో మృతిచెందిన పాత్రికేయుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి
శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి