ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ

జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి... విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు.

జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ
జిల్లా వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ

By

Published : Oct 8, 2020, 7:15 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యా రంగంపై విశేషమైన దృష్టి పెట్టి, ఉన్నత విద్యా వంతులను తయారుచేసేందుకు కృషిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు బంట్లమెట్ట ప్రభుత్వ బాలికల పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రైవేట్‌ విద్యను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఉన్నత విద్యా వంతుడు కావాలనే ఉద్దేశంతో నాణ్యమైన విద్యను, సకల సౌకర్యాల గల పాఠశాలలను అందుబాటులోకి తీసుకువస్తున్నారన్నారు. పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ , విద్యాశాఖాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యాకానుక కిట్లు పంపిణీచేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

యర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా విద్యాకానుకను ప్రారంభించారు. యర్రగొండపాలెం పట్టణంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు.

విద్యార్థులకు కిట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే కరణం బలరాం

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కార్పొరేట్ విద్య అందించటమే ప్రభుత్వం లక్ష్యమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. చీరాల మున్సిపల్ ఉన్నతపాఠశాలలో విద్యా కానుక కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రా రెడ్డి గారు, డీఈవో వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు.

విద్యా కానుక కిట్లతో విద్యార్థులు

ప్రతి ఒక్క విద్యార్థికి ప్రైవేట్ విద్య అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పర్చూరు వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథం బాబు అన్నారు పర్చూర్​లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రావి రామనాథం బాబు మాట్లాడుతూ పర్చూరు నియోజకవర్గంలో 22,917 మంది విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశామన్నారు.

ఇదీ చదవండి:

కరోనా రెండోసారి తిరగబడుతోంది: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details