ప్రకాశం జిల్లా మార్టూరు కొనిదెన రోడ్డులోని టైలర్స్ షాపు వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్నంరాజు ఈశ్వర సాయికుమార్ అనే యువకుడు అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. నిందితుని వద్ద నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న యువకుడు అరెస్టు - martur latest news
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కొనిదెన రోడ్డులో దాడులు నిర్వహించి.. యువకుడిని పట్టుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు