ప్రకాశం జిల్లాలో కంకర వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. ప్లాట్లు చదును చేయడానికి, రహదారులు, ఇళ్ల నిర్మాణానికి ముందుగా కంకరతో నింపాల్సిఉంటుంది. ప్రజావసరాలకు ఉపయోగించే కంకరను తవ్వేందుకు భూగర్భ గనుల శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే లెక్కల్లో ఒకటి అర చూపి, అదనంగా తవ్వుకుపోతున్నారు. వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్లకు ఆనుకొని ఉన్న గుట్టల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇళ్లస్థలాలకోసం నిర్దేశించిన ప్రాంతాలను చదును చేయడానికి కూడా పెద్ద ఎత్తున కంకర వినియోగిస్తున్నారు. ఎక్కడ వినియోగించినా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిఉంటుంది.
- ఆ కొండపై అధికార పార్టీ నేతల కన్ను..
ప్రకాశం జిల్లాలో అక్రమంగా కంకర తవ్వకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని మద్దపాడు మండలం అన్నంగి, బూరేపల్లి ప్రాంతాల్లో గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పెద్దలు కొందరు ఈ కంకర కొండపై కన్నేశారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న బూరేపల్లి కొండల్లో తవ్వకాలు సాగిస్తున్నారు. రోజుకు వందల లోడ్లు అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు 500, టిప్పర్‌కు 2 వేల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. రాత్రి, పగలు తవ్వకాలు సాగిస్తున్నారు.
- తవ్వేది అక్రమంగా.. పొందేది ప్రభుత్వ బిల్లులు