ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలతో ప్రజలు హడలిపోతున్నారు. చీరాల,వేటపాలెం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. జిల్లాలో సాధారణం మించి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ దొనకొండ మండలంలో అత్యధికంగా 45.90 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తరువాతి స్థానంలో కృష్ణా జిల్లాలోని జీ.కొండూరులో 45.89 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చీరాల, కారంచేడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండకు వడగాల్పులు తోడైనందున తప్పనిసరైతే గానీ ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరో 5 రోజులు ఇలాగే ఎండలు ఉంటాయని తెలిపారు. నిన్న ఇంకొల్లులో వడగాల్పులకు ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.