ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది జలకళ సంతరించుకుంది. ఇటీవల విడుదల చేసిన సాగర్ జలాలు, కురిస్తున్న వర్షాలకు నీటి నిల్వలు పెరిగాయి. మొన్నటిదాకా ఎండిపోయిన గుండ్లకమ్మ నేడు నీటి ప్రవాహంతో ఆహ్లాదకరంగా మారటంతో . పరిసర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో తాగునీటి కష్టాలు తొలిగిపోయినట్లేనని అద్దంకి పట్టణ వాసులకు సంతోషపడుతున్నారు. గుండ్లకమ్మ నిండుకుండలా మారటంతో వేసవి తాపం నుంచి ఉపశమనం కలగనుందని... మూగజీవాలకు గొంతు తడవనుందని ప్రజలు ఆనందపడుతున్నారు.
నీటితో కళకళలాడుతున్న.. గుండ్లకమ్మ
నిన్నటి వరకు ఎడారిలా ఉన్న అద్దంకి గుండ్లకమ్మ నిండు కుండలా మారింది. వర్షపు నీరు, సాగర్ నీరు చేరికతో జలకళ సంతరించుకుంది.
'నీటితో కళకళలాడుతున్న అద్దంకి గుండ్లకమ్మ నది'