వినాయక చవితి సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వివిధ ఆకారాలల్లో ముస్తాబు అవుతోన్న లంబోదరుడి విగ్రహాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కళాకారులు వివిధ రూపాలు, భంగిమల్లో చిన్న పెద్ద ఏకాదంతుని ప్రతిమలను జీవం ఉట్టిపడేలా తయారు చేస్తున్నారు. ఈ గణనాథుల విగ్రహాల ధర రూ. 5 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపడంతో కొందరు అడ్వాన్సు చెల్లించి, నచ్చిన వినాయక విగ్రహాన్ని ముందుగానే బుక్ చేసుకుంటున్నారు.
ఆకట్టుకుంటున్న లంబోదరుడి విగ్రహాలు!
యర్రగొండపాలెంపట్టణంలో వివిద ఆకారాల్లో ముస్తాబు అవుతోన్న లంబోదరుడి ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ganesh statue are attractive to people at yarragonda palem in prakasham district