ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడికి వెళ్లి వస్తూ.... మృత్యు ఒడిలోకి - lorry

తిరుమల శ్రీవారి దర్శించుకోవడానికి వారందరూ ఆనందంగా కలసి వెళ్లారు. తిరిగే వచ్చే క్రమంలో వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో నలుగురిని బలిగొంది. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. వాహనంలో ఉన్న మహిళలు గాయాలపాలయ్యారు.

రోడ్డు ప్రమాదం

By

Published : Jul 28, 2019, 7:12 AM IST

గుడికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికి

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఆరుగురు... తిరుపతికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పాండురంగారావు(42), నరసింహారావు(43), సత్యసాగర్(10), డ్రైవర్ రెడ్డి (44) మృతి చెందారు. అనురాధ భాను, సుప్రియలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్​పీ ప్రసాద్, సీ.ఐ సుబ్బారావు, ఎస్సై ఖాదర్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details