ప్రకాశం జిల్లా పామూరు మండలం గుమ్మళంపాడులో... ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అధికారులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి ధ్వంసమైన శిలాఫలకాన్ని పరిశీలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్సై అంబటి చంద్రశేఖర్ తెలిపారు. కాగా... ఈ శిలాఫలకాన్ని ఈ నెల ఐదో తేదీన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు.
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ప్రకాశం జిల్లా గుమ్మళంపాడులో శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు