ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్​ డబ్బు కోసం తండ్రిని చంపిన తనయుడు

ఆరుగురు సంతానం ఉన్నా... ఆ తండ్రికి చిన్న కొడుకంటే ఎనలేని ప్రేమ. అందరూ స్థిరపడినా.. చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదనే దిగులు. ఎప్పుడు డబ్బు అవసరమైనా లేదనకుండా తనకొచ్చే పింఛను నుంచి ఇచ్చేవాడు. వృద్ధాప్యంలో ఉండి కూడా తల్లిలేని లోటు కనపడనీయకుండా తానే వంటావార్పు చేస్తూ కడుపు నింపేవాడు. అయినా ఆ తనయుడిలో మానవత్వం లేకుండా పోయింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వలేదని కన్న తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లా బొబ్బేపల్లిలో జరిగింది.

By

Published : Jun 15, 2020, 11:05 PM IST

పింఛన్​ డబ్బు కోసం తండ్రి చంపిన తనయుడు !
పింఛన్​ డబ్బు కోసం తండ్రి చంపిన తనయుడు !

ప్రకాశంజిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో ఓ వ్యక్తి కన్న తండ్రిని దారుణంగా హతమార్చాడు. పదేళ్ల కిందట పదవీవిరమణ చేసిన విశ్రాంత ఎక్సైజ్ ఏ.ఎస్‍.ఐ బత్తుల పరుశు రామారావు ఎస్సీ కాలనీలో నివాసముంటున్నాడు. కొద్దికాలం క్రితం ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించగా.. మరో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

చిన్న కుమారుడనే మమకారంతో పరుశురామారావు రమేశ్ వద్దనే ఉంటున్నారు. మద్యం, చెడువ్యసనాలకు అలవాటు పడ్డ రమేశ్ డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. ప్రభుత్వం నెల నెలా ఇచ్చే పింఛను 3 రోజుల కిందట రూ.30 వేలు రాగా... ఆ మొత్తం తనకే ఇవ్వాలంటూ శుక్రవారం రాత్రి రమేశ్ తండ్రితో గొడవకు దిగాడు. ఇవ్వనని చెప్పటంతో విచక్షణ కోల్పోయి పక్కనే ఉన్న కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో పరుశు రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details