పొలాల్లో ఒకవైపు తెగుళ్లు.. మరోవైపు కూలీల రేట్లు పెరగడంతో.. ఉద్యాన రైతులు నష్టాల బాట పట్టారు. గతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.200 నుండి 300 వరకు కూలీ చెల్లించేవారు. కానీ, ఇప్పుడు కేవలం మధ్యాహ్నం వరకే రూ.300 చెల్లించాల్సి వస్తోందని.. సాయంత్రం పని చేయాలంటే మరో రూ.200 చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. కూలీలను సైతం ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మిర్చిపంటకు పెట్టింది పేరు. బోర్లను నమ్ముకుని సాగు చేసిన మిర్చి రైతులకు.. గిట్టుబాటు ధర రాక కన్నీరే మిగిలింది. అరకొర వర్షాలతో కనిగిరి ప్రాంతంలో సాగు చేసిన అన్నదాతకు.. దిగుబడి కూడా అంత మాత్రంగానే వచ్చింది. దీనికితోడు పంటకు తెగులు పట్టడంతో.. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.