ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ. 15 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం... ఆరుగురు అరెస్టు

ప్రకాశం జిల్లా యద్దనపూడి పోలీసులు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన నకిలీ కరెన్సీ , ఇన్నోవా కారు స్వాదీనం చేసుకున్నారు.

రూ. 15 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం
రూ. 15 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం

By

Published : Nov 17, 2020, 10:28 PM IST

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను ప్రకాశం జిల్లా యద్దనపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 15 లక్షల విలువైన నకిలీ కరెన్సీ , ఇన్నోవా కారు స్వాదీనం చేసుకున్నారు.

ఇలా దొరికారు...

యనమదల రహదారిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్న ఓ ఇన్నోవా కారును ఆపి తనిఖీలు చేస్తుండగా... కారులోని వారంతా దిగి పారిపోబోయారు. అప్రమత్తమైన పోలీసులు వెంబడించి ఆరుగురుని పట్టుకున్నారు. మరో ఇద్దరు తప్పించుకున్నారు. నిందితులను విచారించి... 15 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు అద్దంకికి చెందిన బక్కా అబ్రహం, రాయపాటి క్రాంతి, రేగులగడ్డ సురేష్, పేరాలకు చెందిన నందం రామస్వామి, దుడ్డు రవికుమార్, చీరాలకు చెందిన బచ్చు యుగంధర్​లు గుర్తించామన్నారు. తప్పించుకొని పారిపోయిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

బాలుడు వినయ్ అదృశ్యం ఘటన సుఖాంతం..కిడ్నాప్​ పేరిట డ్రామా

ABOUT THE AUTHOR

...view details