ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో అవకతవకలు

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల అవకతవకలను గుర్తించారు. పామూరులోని ఓ దుకాణంలో లెక్కలు సరిగా లేకపోవటంతో చలానా కట్టించారు.

excide officers rides on liquor shops
excide officers rides on liquor shops

By

Published : Apr 13, 2020, 4:39 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు మండలాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలను అతిక్రమించి షాపులు తెరిచి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న అనుమానంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ సోదాలు నిర్వహించినట్లు మార్కాపురం ఎక్సైజ్ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. పామూరులోని ఓ మద్యం దుకాణంలో లెక్కలు సరిగా లేవని గమనించి 80,000 రూపాయలు చలానా కట్టించామని కనిగిరి ఎక్సైజ్ సీఐ విజయభాస్కర్ రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details