ప్రకాశం జిల్లా గిద్దలూరులో యువ కేర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆరిఫ్.. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తన వివాహం సందర్భంగా 125 మంది పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంచిపెట్టారు.
ఈ విధంగా పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని సంస్థ అధ్యక్షుడు అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు.